![]() |
![]() |

హిందీ చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. (Manoj Kumar)
మనోజ్ కుమార్ అసలు పేరు హరిక్రిషన్ గోస్వామి. 1937 లో జన్మించిన ఆయన, ఫ్యాషన్ బ్రాండ్ (1957) చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. పలు చిత్రాలలో మరుపురాని పాత్రలు పోషించి స్టార్డమ్ సొంతం చేసుకున్న ఆయన.. దర్శకుడిగానూ చెరిగిపోని ముద్ర వేశారు. ఉప్కార్, రోటీ కపుడా ఔర్ మక్కాన్, క్రాంతి వంటి చిత్రాలు మనోజ్ కుమార్ కి ఎంతో పేరు తీసుకొచ్చాయి. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంలో మనోజ్ కుమార్ కి మంచి పేరుంది. దీంతో ఆయనను అందరూ భరత్ కుమార్ అని ముద్దుగా పిలిచేవారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మనోజ్ కుమార్ ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు పొందారు. 1992లో పద్మశ్రీ, 2015 లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. 1999లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.
![]() |
![]() |